Minister KTR: ఏ రాష్ట్ర రైతుల ఆదాయం పెరిగిందో చెప్పాలన్న మంత్రి కేటీఆర్
Minister KTR: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధానమంత్రి మోడీ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని ఎంతో మంది రైతుల ఆదాయం డబుల్ అయిందన్న కేంద్ర వ్యవసాయ ట్విట్టర్ పోస్టుపై ఘాటుగా స్పందించారు. ఏరాష్ట్రానికి చెందిన రైతులకు లాభాల పంట పండి ఆదాయం డబుల్ అయిందో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చెపుతున్నది నిజమే అయితే అందుకు సంబంధించిన సమగ్ర వివరాలివ్వాలన్నారు.
అటు అన్ పార్లమెంటరీ పదాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూనే చలోక్తులతో బీజేపీ నేతల మాటలను ఉదహరిస్తూ సెటైర్లు వేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్లపైకి వచ్చిన దేశ ప్రజలను "ఆందోళన్ జీవి" అని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ అనొచ్చు కానీ మిగతావారెవ్వరూ అభ్యంతరకరంగా మాట్లాద్దేమో అని చురకలంటించారు. దేశానికి అన్నం పెట్టే రైతులను "టెర్రరిస్టులు" అని పిలిస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఓకేనా అని ప్రశ్నిస్తూ ప్రకటన విడుదల చేశారు.
If the claim 👇of the Agriculture Dept is true, I request the Hon'ble @PMOIndia to furnish the details to the people of this country
— KTR (@KTRTRS) July 16, 2022
1) How many millions of farmers doubled their Income?
2) Which state are these farmers from?
3) Which initiative of Govt was key to achieve this? https://t.co/5mTGmJtw3D
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire