Minister KTR: అగ్నిపథ్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్వీట్
Minister KTR: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థుల అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. అగ్నిపథ్ యోజనలో యువకుల ప్రయోజనాలను సంరక్షిస్తూ అభ్యర్థుల వయోపరిమితిలో రెండేళ్లు రాయితీని ఇచ్చామని అమిత్‌షా తెలిపారు. కరోనాతో గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ లేని చెప్పారు. యువకులకు సాయుధ దళాల్లోకి ప్రవేశించే అవకాశం దక్కకపోవడంతో.. వయోపరిమితి 21 నుంచి 23ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అమిత్ షా తెలిపారు.
అగ్నిపథ్‌పై హింసాత్మక నిరసనలు దేశంలో నిరుద్యోగ సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. అగ్నిపథ్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోని రైతులతో ఆటలాడారని ఇప్పుడు సైన్యంతో ఆటలాడుతున్నారని ఆరోపించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్ నో పెన్షన్‌గా మారిందని కేటీఆర్ విమర్శించారు.
అగ్నిపథ్ పథకంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. అగ్నిపథ్ యోజన ద్వారా యువతకు రక్షణ వ్యవస్థలో చేరి దేశానికి సేవ చేసేందుకు సువర్ణావకాశం దక్కుతుందని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధాని సూచనల మేరకు కేంద్రం ఈసారి అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ వయోపరిమితిని 23 సంవత్సరాలకు పెంచిందన్నారు. మరికొద్ది రోజుల్లో సైన్యంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
The violent protests against #AgniveerScheme is an eye-opener & acute indicator of the magnitude of unemployment crisis in the country
— KTR (@KTRTRS) June 17, 2022
Pehle Desh ke Kisan Ke Saath खिलवाड़ Aur Ab Desh ke Jawan Ke Saath खिलवाड़
From One Rank - One Pension to proposed No Rank - No Pension!
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire