KTR: తెలంగాణాలో మరోసారి బీఆర్‌ఎస్‌దే అధికారం

Minister KTR Participates In Malakpet Road Show
x

KTR: తెలంగాణాలో మరోసారి బీఆర్‌ఎస్‌దే అధికారం

Highlights

KTR: 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణే

KTR: తెలంగాణ లో మరోసారి బీఆర్ఎస్ సర్కారు ఏర్పడడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆరే హట్రిక్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల మాటలు విని ఆగం కావద్దని... బీ ఆర్ ఎస్ గెలిస్తేనే అభివృద్ధి కొనసాగుతదని తెలిపారు. మలక్ పేట బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోరుతూ మలక్ పేట టీ జంక్షన్ నుంచి ముసారాం బాగ్ మీదుగా సాగిన రోడ్ షో లో కేటీఆర్ పాల్గొన్నారు. సీఎం..సీఎం..నినాదాలతో కేటీఆర్ రోడ్ షో దద్దరిల్లింది.

Show Full Article
Print Article
Next Story
More Stories