నేడు టీఆర్ఎస్ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ కీలక భేటీ!

నేడు టీఆర్ఎస్ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ కీలక భేటీ!
x
Highlights

టీఆర్‌ఎస్‌ కొత్త కార్పొరేటర్లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్‌కు రావాలని కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ కొత్త కార్పొరేటర్లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్‌కు రావాలని కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ విషయమై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఏపార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, తెలంగాణలోని మరిన్ని నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించనున్నట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఇక ఈ భేటీలో గ్రేటర్ ఫలితాలపై కేటీఆర్ సమీక్షించనున్నారు. టీఆర్ఎస్‌కు ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నప్పటికీ మరొకరి సాయంలేకుండా మేయర్ పీటం సాధించే పరిస్థితిలేదు. దీంతో సభ్యులందరూ అయోమయంలో పడిపోయారు. అందుకే ఇవాళ జరిగే సమావేశం కీలకం కానుంది. గ్రేటర్ మేయర్‌కు మరో రెండు నెలల సమయం ఉంది. మేయర్ రేసులో ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇవాళ్టి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories