KTR: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ టెక్ సెల్ వింగ్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurated The BRS Tech Cell Wing At The Sircilla District Centre
x

KTR: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ టెక్ సెల్ వింగ్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Highlights

KTR: గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ రగుడు వద్ద తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్ వింగ్‌ను మంత్రులు కొప్పుల ఈశ్వర్, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. అనంతరం పలు మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ టీపీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు చోక్కాల రాముతో పాటు 200 మంది కార్యకర్తలు మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.. మీరందరి రాకతో బీఆర్ఎస్‌కు మరింత శక్తి వచ్చిందని, జిల్లాలో విస్తరించిని 4 నియోజకవర్గాల్లో గులాబీ జండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories