రూ.10 వేలను అడ్డుకున్నోళ్ళు రూ.25 వేలు ఎలా ఇస్తారు: కేటీఅర్

రూ.10 వేలను అడ్డుకున్నోళ్ళు రూ.25 వేలు ఎలా ఇస్తారు: కేటీఅర్
x
Highlights

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా శనివారం ఓల్డ్ అల్లాపూర్‌ చౌరస్తా నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్దులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా శనివారం ఓల్డ్ అల్లాపూర్‌ చౌరస్తా నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్దులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా బీజేపీ నేతల పైన విరుచుకపడ్డారు కేటీఆర్. రూ.10 వేల సాయాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు.. గెలిస్తే రూ.25 వేలు ఇస్తారాని ప్రశ్నించారు. ప్రశాంతగా ఉన్న హైదరాబాద్ ను అరాచకం చేస్తున్నారని అన్నారు.

అభివృద్ధిగా ఉన్న హైదరాబాద్ కావాలో అరాచకం కావాలో తేల్చుకోవాలని అన్నారు. ఇక అటు హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది కాబట్టే.. అమెజాన్‌, గూగుల్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు నగరాని వచ్చాయన్నారు. హైదరబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్‌ ఎన్నో పనులు చేపట్టారు. మరి ఆరేండ్లలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఒక్కపనైనా చేసిందా అని ప్రశ్నించారు. బల్దియాపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్


Show Full Article
Print Article
Next Story
More Stories