బస్సెక్కి.. టిక్కెట్లు ఇచ్చిన మంత్రి అల్లోల

బస్సెక్కి.. టిక్కెట్లు ఇచ్చిన మంత్రి అల్లోల
x
Highlights

కరోనా మహమ్మారి నిర్మూలన కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

కరోనా మహమ్మారి నిర్మూలన కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి ఆదేశాలను పాటిస్తూ భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలని సూచించారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల్లో మంత్రి ఆకస్మికంగా ప‌ర్య‌టించారు. ఆయా ప్రాంతాల్లోని దుకాణ సముదాయాలు, చికెన్ షాపులను ప‌రిశీలించారు. వ్యాపారులు, ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం చెప్పిన‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తున్నారా లేదా అని ప‌రిశీలించారు. నిర్మ‌ల్ టీ సెంట‌ర్ నుండి నారాయ‌ణ రెడ్డి మార్కెట్, గంగా కాంప్లెక్స్, బ‌స్టాండ్ వ‌ర‌కు పాద‌‌యాత్ర నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 31వరకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వ్యాపారులు, ప్ర‌జ‌లు స్వచ్ఛందంగా ప్రభుత్వ నిబంధ‌న‌ల‌ను పాటించాలని సూచించారు. దుకాణాల వద్ద ప్రజలు భౌతిక‌ దూరాన్ని పాటించేలా చూడాలని, మాస్కులు ఉన్న‌వారినే షాపుల్లోకి అనుమ‌తించాల‌ని వ్యాపారుల‌కు సూచించారు. ప్ర‌జ‌లంతా మాస్కులు ధ‌రించాల‌ని, నిబంధ‌ల‌ను పాటించ‌ని వారిపై చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

ప్ర‌భుత్వం లాక్ డౌన్ స‌డ‌లించిన‌ నేప‌థ్యంలో ప‌ట్ట‌ణంలోని దుకాణాలను తెరిచార‌ని, ఆర్టీసీ బ‌స్సుల‌ను కూడా న‌డిపిస్తున్నామ‌న్నారు. దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు టిఫిన్, భోజ‌న స‌దుపాయం క‌ల్పించేలా బ‌స్టాండ్ లోని క్యాంటీన్ల‌ను, బేక‌రీల‌ను తెరిచే విధంగా చూడాల‌ని డీయంను మంత్రి ఆదేశించారు. వ్యాపారులు, ప్రజలంతా నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ణప్తి చేశారు. బ‌స్టాండ్ ను ప‌రిశుభ్రంగా ఉంచ‌డంతో పాటు ప్ర‌యాణికుల‌ను శానిటైజ‌ర్ల‌ను అందుబాటులో ఉంచామ‌ని తెలిపారు.

ఆ తరువాత నిర్మల్ బస్టాండ్ నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు ఆర్టీసీ బస్సులో మంత్రి అల్లోల, ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రయాణించారు. అంతే కాకుండా బస్సులో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి కొంద‌రికి మంత్రి స్వ‌యంగా టిక్కెట్లను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, జిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్ ఎర్ర‌వోతు రాజేంద‌ర్, ఎఫ్ఎస్సీయ‌స్ చైర్మ‌న్ ధ‌ర్మాజీ రాజేంద‌ర్, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ నాయ‌కులు మారుగొండ రాము, కౌన్సిల‌ర్లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిదులు, అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories