Harish Rao: ముత్యాల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు

Minister Harish Rao visits Mutyala Pochamma Temple In Siddipet
x

Harish Rao: ముత్యాల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు

Highlights

Harish Rao: అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

Harish Rao: సిద్దిపేట టీహెచ్ఆర్ నగర్‌లోని ముత్యాల పోచమ్మ ఆలయంలో బోనాల జాతర వైభవంగా జరిగింది. మంత్రి హరీశ్‌రావు..అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీ వాసులకు ఆలయ ఐదవ వార్షికోత్సవం, బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఇక.. టీహెచ్ఆర్ నగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలకు దశల వారీగా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్.

Show Full Article
Print Article
Next Story
More Stories