టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే తెలంగాణలో మార్పు వచ్చింది : మంత్రి హరీష్ రావు

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే తెలంగాణలో మార్పు వచ్చింది : మంత్రి హరీష్ రావు
x
Highlights

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మార్పు వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ...

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మార్పు వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఇంటింటికి నల్లా ఇచ్చిండన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వ దవఖానలో కేసీఆర్ కిట్టు ఇస్తున్నామని, దీంతో ప్రైవేట్ దవఖానలు మూతపడ్డాయని ఆయన తెలిపారు. 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. బీజేపీ వాళ్లు బాయిలకాడ మిటర్లు పెడుతం అంటున్నారన్నారు. కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తుండు. కాంగ్రెస్ అంటే కాలిపోయిన మీటర్లు, బీజేపీ అంటే బాయికాడ మీటర్లు టీఆర్ఎస్ అంటే ఉచిత కరెంటు మీరు ఎవరూ వైపు ఉంటారో నిర్ణయించుకోవాలి. బండి సంజయ్ కి సవాల్ విసిరిన ఇంక వస్తలేడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్టులో మొత్తం పైసలు మావే బీజేపీవి ఏం లేవన్నారు. కాంగ్రెస్ బీడీ కార్మికులకు పూర్రె గుర్తు పెట్టిండు బిజెపి జీయస్టీ పెట్టింది కెసిఆర్ పెన్షన్ ఇస్తుండు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్ 1500 రుపాయలు బియ్యం ఇచ్చిండు.

కేసీఆర్ రెవెన్యూ చట్టం తెచ్చిండు రేపు కెసిఆర్ ప్రారంబిస్తారన్నారు. రుపాయి ఖర్చు లేకుండా పాసు పుస్తకాలు ఇంటికి పంపించదే కొత్త రెవెన్యూ చట్టం అని తెలిపారు. ఓట్ల సమయంలో హైదరాబాద్ నల్గొండ నుంచి వస్తున్నారు ఎవ్వరిని నమ్మోద్దని ఆయన కోరారు. కాంగ్రెస్ బిజెపి ఎండ మావులు లాంటివి వస్తాయ్ పోతాయ్ టిఆర్ఎస్ ఎప్పటికీ ఉంటుందన్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి కొండపోచమ్మ సాగర్ నింపినం అని పలికారు. గోదారమ్మ నీళ్లతో కాళ్లు కడుగుతామని ఆయన అన్నారు. గతంలో గ్రామలకు ఎమ్మెల్యేలు వస్తే ఖాళీ బిందెలతో మహిళలు స్వాగతం పలికేవారు ఇప్పుడు అలాంటిది లేదన్నారు. సుజాత అక్కకు నేను అండగా ఉంటా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పుడు మీకు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఇళ్లు ఇపిస్తాం అని హామీ ఇచ్చారు. లక్ష రూపాయల రుణ మాఫీలో 25 వేలు మాఫీ చేసినం అని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories