దుబ్బాకలో టీఆర్ఎస్‌ ఓటమికి బాధ్యత వహిస్తున్నా : హరీశ్ రావు

దుబ్బాకలో టీఆర్ఎస్‌ ఓటమికి బాధ్యత వహిస్తున్నా : హరీశ్ రావు
x
Highlights

దుబ్బాక ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నాన్నట్లు ప్రకటించారు మంత్రి హరీశ్ రావు. ప్రజాతీర్పును శిరసావహిస్తానన్నారు.. టీఆర్ఎస్‌కు ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

దుబ్బాక ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నాన్నట్లు ప్రకటించారు మంత్రి హరీశ్ రావు. ప్రజాతీర్పును శిరసావహిస్తానన్నారు.. టీఆర్ఎస్‌కు ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి.. ఓటమి కారణాలను సమీక్షించుకుంటామని తెలిపారు. ఓడినా దుబ్బాక ప్రజల సేవలో పాటుపడుతామన్నారు హరీశ్ రావు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజక అభివృద్ది చేస్తామని అన్నారు..

దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై అటు మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.. అయితే తాము విజయాలకి పొంగిపోమని, అలాగే అపజాయలకి కుంగిపోమని అన్నారు.. పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. ఇక ఫలితాలు ఎందుకు రాలేదనే అంశం పైన త్వరలోనే సమీక్షించుకుంటామని అన్నారు. దుబ్బాక ఫలితాలతో తాము అప్రమత్తం అవుతామని అన్నారు.

ఇక అటు సంచలన విజయం సాధించి బీజేపీ మొదటిసారి దుబ్బాకలో విజయకేతనం ఎగురవేసింది. 14వందల ఓట్లకు పైగా తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత మీద బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలలో సాగిన లెక్కింపులలో రఘునందన్ రావు కు 62,772 ఓట్లు రాగా, సోలిపేట సుజాతకి 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి.. ఓట్ల శాతంగా చూసుకుంటే.. బీజేపీకి 39%, టీఆర్ఎస్ కి 37% ఓట్లు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories