బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తాడా? మంత్రి హరీష్ రావు

బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తాడా? మంత్రి హరీష్ రావు
x
Highlights

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఎలక్షన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎలక్షన్లలో భాగంగా మంత్రి హరీష్‌రావు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ...

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఎలక్షన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎలక్షన్లలో భాగంగా మంత్రి హరీష్‌రావు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. దుబ్బాక లో టీఆరెస్ జెండా గద్దె కూలగొట్టినట్లు, టీఆర్ఎస్ నాయకులపై ప్రజలు ఎదురు తిరిగినట్లు నిన్నటి నుండి సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో ఎన్నికల సమయంలో కల్వకుర్తి లో జరిగిన సంఘటనను దుబ్బాక లో జరిగినట్లు సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారన్నారు.

ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసామని, సోషల్ మీడియా లో ప్రచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి జైల్ కు తరలించారని ఆయన తెలిపారు. స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద దుబ్బాక కు ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు దుర్వినియోగం అయినట్లు సోషల్ మీడియా లో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. దుబ్బాక ప్రజలు ఈ విషయాలన్నీ గమనించాలని విజ్ఞప్తి చేసారు. బీడీ కార్మికులకు ఇచ్చే 2000 పెన్షన్ లో 1600 బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని కరీంనగర్ బీజేపీ మహిప కార్పొరేటర్ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. బండి సంజయ్ కు మంత్రి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్న విషయం వాస్తవమే అయితే దుబ్బాక పాత బస్టాండ్ వద్ద చర్చ కు నేను సిద్ధం అన్నారు. మీరు చెప్పేది నిజమైతే...బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్ లో ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని నిరూపించినా నేను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అని ఛాలెంజ్ చేసారు.

రుజువు చేయలేకపోతే బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తాడా? అని ప్రశ్నించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో ఇదే విధంగా బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని, ఆ ఎన్నికల్లో చపాతీ మేకర్ గుర్తు ఉన్న అభ్యర్థి కన్నా తక్కువ ఓట్లు బీజేపీ కి వచ్చాయని ఆయన స్పష్టం చేసారు. దుబ్బాక లో అదే విధమైన గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. హుజూర్ నగర్ లో బీజేపీ కి జరిగిన పరాభవమే, దుబ్బాక లో జరుగుతుందన్నారు. బీజేపీ నాయకులకు నిజమైన చిత్త శుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను, రాజ్యాంగ బద్దంగా, హక్కుగా రావాల్సిన పన్ను బకాయిలను రప్పించండన్నారు. అంతే తప్ప అబద్ధపు, అసత్యపు ప్రచారాలను మానుకోవాని తెలిపారు. దుబ్బాక ప్రజలను ముమ్మాటికీ మీ మాటను నమ్మరు అని, బీజేపీ కి హుజూర్ నగర్ లో, నిజామాబాద్ లో ఎదురైన ఫలితమే దుబ్బాకలో పునరావృతం కానుందని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories