Telangana: కరోనా కట్టడికి ఈటల మాస్టర్ ప్లాన్..

Telangana: కరోనా కట్టడికి ఈటల మాస్టర్ ప్లాన్..
x

Telangana: కరోనా కట్టడికి ఈటల మాస్టర్ ప్లాన్..

Highlights

Telangana: కరోనా మహమ్మారి భారత్‌ను కలవరపెడుతోంది. తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

Telangana: కరోనా మహమ్మారి భారత్‌ను కలవరపెడుతోంది. తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల పాటు తనను ఎవరూ కలవొద్దని సూచించారు. జిల్లాల నుంచి కానీ నియోజకవర్గం నుంచి ప్రజలెవరూ తనను కలవడానికి రావొద్దంటూ సూచనలు చేశారాయన. అయితే తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డారు.

ఇదిలా ఉంటే ఆక్సిజన్‌ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలను అనుమతిస్తోంది. ఆక్సిజన్‌ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లాయి. భువనేశ్వర్‌ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి రానుంది. దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్‌ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories