కరోనా బాధితులకు ధైర్యం చెప్పిన మంత్రి

కరోనా బాధితులకు ధైర్యం చెప్పిన మంత్రి
x
Highlights

Minister Errabelli talking to corona victims : కరోనా బారిన పడిన బాదితులతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.

Minister Errabelli talking to corona victims : కరోనా బారిన పడిన బాదితులతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఆరోగ్యం బాగుందా.. వైద్యం అందుతోందా.. మీరు అధైర్య పడొద్దు... మీకేం కాదు అంటూ వారిని ఆప్యాయంగా పలకరించారు. కరోనాతో భయపడాల్సిందేమీ లేదు అంతా ఆరోగ్యంగా ఉంటారు అంటూ ధైర్యం చెప్పారు. ఒకరిద్దరికి తప్పా పెద్దగా ఇబ్బందులు ఏమీలేవు అంటూ ఆయన అన్నారు. హైదరాబాద్ నుంచి పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులతో మంత్రి ఆదివారం వేర్వేరుగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీకు ఏం కాదు నేనున్నాను అంటూ బాధితులకు భరోసా కల్పించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి మించిన, మంచి వసతులు ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. సీఎం, కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తి పెరిగే విధంగా ఆహారం తీసుకోవాలన్నారు. మరీ ఇబ్బందులు అనిపిస్తే చాలు నాకు గానీ, నా వద్ద పని చేసే సిబ్బందికి గానీ ఫోన్ చేయమని సూచించారు. ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడంతోపాటు, తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(శనివారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,384 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,04,249కి చేరింది. మృతుల సంఖ్య 755కి పెరిగింది. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 80,585కి చేరింది. ప్రస్తుతం 22,908 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్క రోజే 1,851 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఒక్క రోజే 40,666 టెస్టులు చేయగా 2,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,31,839 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 472, రంగారెడ్డిలో 131, జగిత్యాల లో 105 కేసులు నమోదయ్యాయి.. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 72.72గా ఉంది. దేశంలో 70.76గా రికవరీ రేట్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.72 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 1.87 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories