Allola Indrakaran Reddy: పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తాం

Minister Allola Indrakaran Reddy said that tribals will be given rights over barren lands
x

Allola Indrakaran Reddy: పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తాం

Highlights

Allola Indrakaran Reddy: ప్రభుత్వ పరంగా భూ హక్కులు కల్పిస్తే.. ప్రభుత్వ పథకాలు వస్తాయి

Allola Indrakaran Reddy: పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సింగరేణి గెస్ట్ హౌస్‌లో పోడు భూముల సమస్య పరిష్కారాలు, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్సీ దండే విటల్, జిల్లా కలెక్టర్ భారతి , జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించి, అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అటవీ సంరక్షణ తో పాటు పోటు భూముల పరిష్కార మార్గాలు, దళిత బంధు, ఆసరా పింఛన్ల మంజూరుపై అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లు సరైన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో కమిటీలు వేసి సర్వే నిర్వహిస్తున్నామని దాని ఆధారంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో త్వరలోనే ఒక పరిష్కార మార్గం చూపే విధంగా నిర‌్ణయం తీసుకుంటారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories