అనూహ్యంగా మేయర్ బరిలో నిలిచిన ఎంఐఎం

GHMC
x

మేయర్ బరిలో నిలిచిన బీజేపీ, ఎంఐఎం

Highlights

అనూహ్యంగా మేయర్ బరిలో నిలిచిన బీజేపీ, ఎంఐఎం కలెక్టర్‌కు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు దరఖాస్తు

జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికకు మరికొద్ది గంటలే మిగిలాయి. మేయర్‌ కౌన్‌ బనేగా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నిన్నటి వరకు టీఆర్ఎస్‌దే మేయర్ పదవి అని భావించినప్పటికీ అనూహ్యంగా బీజేపీ, ఎంఐఎం కూడా మేయర్ బరిలో నిలిచాయి. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే.. బల్దియాలో ఏ పార్టీకి స్పష్టంమైన మెజారిటీ రానప్పటికీ.. అతిపెద్ద పార్టీ అయిన టీఆర్ఎస్‌కే మేయర్, డిప్యుటీ మేయర్ పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ఇక మరికొద్ది గంటలే మిగులుంది. మేయర్ పీఠం మాదంటే మాదంటూ ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు. కానీ, అంతిమంగా కౌన్ బనేగా మేయర్ అన్నదే ఉత్కంఠ రేపుతోంది. నిన్నటివరకు ఏ పార్టీ కూడా... మేయర్ ఎన్నికపై స్పందించకపోవడంతో టీఆర్ఎస్‌దే అని భావించారంతా. కానీ తామూ బరిలో దిగుతామని బీజేపీ ప్రకటించడంతో గ్రేటర్ రాజకీయం రసవత్తరంగా మారింది.

అయితే, ఏ పార్టీ ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్ధి ఎవరనేది సీల్డ్ కవర్ నిర్ణయించనుంది. బీజేపీ పోటీ చేస్తామని చెప్పినా అభ్యర్థి పేరు మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇక, ఎంఐఎం టీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా..? లేక రేసులో ఉంటుందా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, మేయర్ ఎన్నికకు దూరంగా ఉండాలని ఎంఐఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో, మేయర్ ఫైట్ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే జరిగేలా కనిపిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories