MEO and MPDO Conflict in Mahabubnagar: ఎంఈవో, ఎంపీడీవో మధ్య ఘర్షణ...

MEO and MPDO Conflict in Mahabubnagar: ఎంఈవో, ఎంపీడీవో మధ్య ఘర్షణ...
x
Highlights

MEO and MPDO Conflict in Mahabubnagar: వారిద్దరూ బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే వారిలో ఒకరు మండల పరిపాలనను గాడిలో పెట్టే అధికారి అయితే...

MEO and MPDO Conflict in Mahabubnagar: వారిద్దరూ బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే వారిలో ఒకరు మండల పరిపాలనను గాడిలో పెట్టే అధికారి అయితే మరొకరు మండలం విద్యాధికారి. ఈ ఇద్దరు అధికారుల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తిగత విభేదాలు సోమవారం తారస్థాయికి చేరాయి. దీంతో ఆ ఇద్దరు అధికారులు ఒకరినొకరు మిర్శించుకుంటూ ఎంపీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వారి తగాదా సర్దుమనగక పోగా ఎక్కువ కావడంతో ఈ ఇద్దరు ఎంపీపీ సమక్షంలోనే పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తివిరాల్లోకెళితే లక్ష్మణ్‌సింగ్‌ అనే వ్యక్తి కొన్నేళ్లుగా మండల ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా కొద్ది రోజలు క్రితం నుంచే కోయిల్‌కొండ విద్యాధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, చిన్నచింతకుంట మండలంలో సరిగ్గా బాధ్యతలు నిర్వహించడం లేదని ఎంపీపీ హర్షవర్ధన్‌కు ఎంపీడీఓ ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీపీ హర్షవర్థన్ ఎంపీడీఓ ఫయాజుద్దీన్‌ను, ఎంఈఓలను తన ఛాంబర్‌లోకి పిలిపించారు. ఈక్రమంలోనే మండల కార్యాలయానికి వచ్చిన ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌ మూమెంట్‌ రిజిస్టర్ లో సంతకం చేశారు. అనంతరం ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటు ఘర్షణలకు పాల్పడ్డారు. తనను కులంపేరుతో దూషిస్తూ దాడి చేశాడని ఎంపీడీఓపై ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇక ఈ విషయంపై ఎంపీడీఓ వివరణ కోరగా జూలై నెల మూమెంట్‌ రిజిస్టర్‌లో ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌ ముందస్తుగా మూమెంట్‌ రాసుకున్నారని ఇది సరైన పద్దతి కాదని ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి పిలిపించి అడగారన్నారు. దీంతో ఎంఈఓ ఇబ్బందిగా ఫీలై తనపై దురుసుగా మాట్లాడారన్నారు. అంతేతప్ప ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదన్నారు. ఎంఈఓ దాడిపై టీఎస్‌ యూటీఎఫ్, తెలంగాణప్రాంత ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దాడిచేసిన అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories