Chiranjeevi: ఆ ఘటనలు ఎంతో బాధించాయి.. అందుకే బ్లడ్‌ బ్యాంక్‌..

Megastar Chiranjeevi About Story Behind Blood Bank
x

Chiranjeevi: ఆ ఘటనలు ఎంతో బాధించాయి.. అందుకే బ్లడ్‌ బ్యాంక్‌..

Highlights

Chiranjeevi: రక్తదానం చేయడం చిన్నవిషయం కాదన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.

Chiranjeevi: రక్తదానం చేయడం చిన్నవిషయం కాదన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. బ్లడ్ బ్యాంక్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఎందరో ప్రాణాలను సేవ్ చేస్తున్నారని ఆమె అభినందించారు. 1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారని.. ఆ ఘటనలు తనను ఎంతగానో బాధించిందని చిరంజీవి అన్నారు. తన కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నారని.. వారి ప్రేమని నలుగురికి ఉపయోగ పడేలా మార్చాలనే ఉద్ధేశంతో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించామని చిరంజీవి తెలిపారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా 50 కన్నా ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి రాజ్ భవన్ లో గవర్నర్ చేతుల మీదుగా చిరు భద్రత పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. త్వరలో ఆస్పత్రి కట్టనున్నట్లు చిరంజీవి చెప్పారు. 9.30లక్షల యూనిట్ల రక్తాన్ని ఇప్పటి వరకు సేకరించామని.. దీనిలో 70 శాతం పేదలకు, మిగిలినది ప్రైవేట్‌ ఆస్పత్రులకు అందజేశామని ఆయన వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య ఇప్పుడు చాలా తక్కువగా ఉందన్నారు. రక్తదానం చేసేవారికి ఈ సందర్భంగా చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories