Medaram Jatara: సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి తరలివస్తున్న భక్తులు.. లైవ్ అప్ డేట్స్
Medaram Jatara: జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
Medaram Jatara: వనదేవతలు కొలువై ఉన్న మేడారానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. మేడారానికి చేరుకున్న భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో సమ్మక్క దేవత గద్దె వద్ద భక్త జన సందోహం నెలకొన్నది. భక్తులు పెద్దసంఖ్యలో తరలి రావడంతో జాతర పరిసరాలు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire