మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు.. కరెంటు కోతలను నిరసిస్తూ నిరసనలు, రాస్తారోకో...

Medak Farmers Protest Against Power Cuts | Telangana Live News
x

మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు.. కరెంటు కోతలను నిరసిస్తూ నిరసనలు, రాస్తారోకో...

Highlights

Medak - Farmers: విద్యుత్ కోతలతో చేతికొచ్చిన పంటంతా ఎండిపోతుందని ఆగ్రహం...

Medak - Farmers: మెదక్ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. కరెంటు కోతల కారణంగా తమ పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. ప్రస్తుతం విద్యుత్తు 10 గంటలు మాత్రమే ఇస్తున్నారని..24 గంటలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధార్మారం విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు రైతులు ధర్నా నిర్వహించారు.

గత రెండు రోజులుగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకే కరెంట్ ఇస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో చేతికొస్తున్న వరిపైర్లన్నీ ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేట, చేగుంట, నార్సింగి మండలాల్లో అత్యధికంగా బోర్లపై ఆధారపడి పంటలు వేశారు రైతులు. అయితే విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో పొలాలు బీటలు వారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని..పంటకు చేసిన అప్పులు ఎలా తీర్చాలని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఎండిపోతున్న వరి పంట పొలాల్లోకి పశువులను వదిలేస్తున్నారు. మరికొందరు ట్యాంకర్ల ద్వారా నీటి తడులు అందిస్తూ రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారని వివరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories