ఈట‌ల రాజేంద‌ర్ భూక‌బ్జా వాస్తవమే.. సంచలన విషయాలు వెల్లడించిన కలెక్టర్..

Medak Collector Press Meet Over Etela Rajender Land Issue
x

ఈట‌ల రాజేంద‌ర్ భూక‌బ్జా వాస్తవమే.. సంచలన విషయాలు వెల్లడించిన కలెక్టర్..

Highlights

Etela Rajender - Jamuna Hatcheries: ఈట‌ల రాజేంద‌ర్ భూక‌బ్జా వాస్తవమేన‌ని మెద‌క్ జిల్లా క‌లెక్టర్ స్పష్టం చేశారు. మాసాయిపేట మండ‌లం అచ్చంపేట‌, హ‌కీంపేట్...

Etela Rajender - Jamuna Hatcheries: ఈట‌ల రాజేంద‌ర్ భూక‌బ్జా వాస్తవమేన‌ని మెద‌క్ జిల్లా క‌లెక్టర్ స్పష్టం చేశారు. మాసాయిపేట మండ‌లం అచ్చంపేట‌, హ‌కీంపేట్ ప‌రిధిలో అసైన్డ్ భూముల‌ను జ‌మునా హ్యాచ‌రీస్ క‌బ్జా చేసింది వాస్తవ‌మేన‌ని చెప్పారు. 70.33 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసిన‌ట్లు రెవెన్యూ అధికారుల స‌ర్వేలో తేలింద‌న్నారు.

అచ్చంపేట‌, హ‌కీంపేట ప‌రిధిలో గల సర్వే నంబర్ 77 నుంచి 82, 130, హ‌కీంపేట్‌ శివారులో గల సర్వే నంబర్ 97, 111లో సీలింగ్ భూముల‌ను క‌బ్జా చేశారని స‌ర్వే నంబ‌ర్ 78, 81, 130ల‌లో భారీ పౌల్ట్రీ షెడ్స్, ప్లాట్‌ఫామ్‌లు, రోడ్లను అనుమ‌తి లేకుండా నిర్మించారని వివరించారాయన. స‌ర్వే నంబ‌ర్ 81లో 5 ఎక‌రాలు, 130లో 3 ఎక‌రాల‌ను అక్రమంగా రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారన్నారు. మొత్తంగా 56 మంది అసైనీల భూముల‌ను క‌బ్జా చేసిన‌ట్లు తేలింద‌న్నారు కలెక్టర్.


Show Full Article
Print Article
Next Story
More Stories