వేలు కట్టండి.. లక్ష పట్టండి అన్నారు.. కోట్లు దోచేశారు! కామారెడ్డి జిల్లాలో ఘరానమోసం!!

వేలు కట్టండి.. లక్ష పట్టండి అన్నారు.. కోట్లు దోచేశారు! కామారెడ్డి జిల్లాలో ఘరానమోసం!!
x
Highlights

కూతురు పెళ్లి కోసం పైసా పైసా కూడబెట్టి ఆ సంస్థలో పెట్టుబడి పెట్టాడు. ఇల్లు వాకిలి వదిలి దుబాయికి వెళ్లి తెచ్చిన డబ్బును ఆ సంస్థకు ముట్టజెప్పాడు. ఇలా...

కూతురు పెళ్లి కోసం పైసా పైసా కూడబెట్టి ఆ సంస్థలో పెట్టుబడి పెట్టాడు. ఇల్లు వాకిలి వదిలి దుబాయికి వెళ్లి తెచ్చిన డబ్బును ఆ సంస్థకు ముట్టజెప్పాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు. రోజు కూలీ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఎందరో ఆ సంస్థలో డబ్బులు దాచుకున్నారు. భరోసా గా నిలుస్తుందన్న ఆ సంస్థే ఇప్పుడు వాళ్లందరినీ బాధితులుగా మార్చేసింది.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో 15కోట్ల స్కాం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బీర్షేభా సంస్థ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీర్షేభా సంస్థలో పెట్టుబడి పెట్టిన ఖాతాదారులు మోసపోయామని తెలుసుకొని లబోదిబోమంటున్నారు. తమ డబ్బు తమకు ఇప్పించాలంటూ గ్రామస్తులు ఏజెంట్ల ఇళ్ల ముందు దీక్షలకు దిగారు.

లచ్చాపేట గ్రామంలో 1,130 కుటుంబాలు నివాసముంటున్నాయి. వీటిలో 1050 కుటుంబాలు బీర్షేభా సంస్థలో పెట్టుబడి పెట్టాయి. సంస్థ నిర్వాహకులు గ్రామంలో పలుకబడి ఉన్న వాళ్లకు మాయమాటలు చెప్పి ఏజెట్లుగా చేర్పించుకున్నారు. వారి ద్వారా మరికొందరు మహిళలను సభ్యులుగా తీసుకున్నారు. ఆరు నెలల పాటు సర్ఫ్, గోధుమ, శనగపిండి ఇతర పదార్థాల ప్యాకింగ్ చేయించి నెలకు కొంత నగదు చెల్లించి నమ్మించారు.

గ్రామస్తులకు నమ్మకం కుదిరాక నిర్వాహకులు అసలు ఆట మొదలుపెట్టారు. 30 వేలు నగదు జమ చేస్తే నెలకు 10వేల చొప్పున 10నెలల అందిస్తామంటూ నమ్మించారు. ఏడాది పాటు చెప్పింది చెప్పినట్లు డబ్బులు ఇచ్చారు. ఇక గ్రామస్తులు బుట్టలో పడిపోయారు. ఒక్కొక్కరు మేకలు, గొర్రెలు, బంగారం అమ్మి ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఒక్కో ఫ్యామిలీ లక్ష నుంచి 6లక్షల వరకు బీర్షేభా సంస్థలో జమ చేశారు.

ఇంతలోనే లాక్ డౌన్ వచ్చేసింది. ఈ వంకతో బీర్షేభా సంస్థ డబ్బులు చెల్లించడం నిలిపివేసింది. లాక్ డౌన్ ఎత్తేసినా డబ్బులు రాకపోవడంతో మోసపోయామని గ్రామస్తులు తెలుసుకున్నారు. వెంటనే యజమాని ఇస్మాయిల్ పై కేసు పెట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు సంస్థను సీజ్ చేసి యజమాని ఇస్మాయిల్ ను రిమాండ్ కు తరలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories