Hyderabad: పురానాపూల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరు ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది

Massive Fire Accident in Puranapool
x

Hyderabad: పురానాపూల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరు ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది

Highlights

Hyderabad: కూలర్ల గోడౌన్‌లో చెలరేగిన మంటలు

Hyderabad: హైదరాబాద్ పురానాపూల్ లోని ఓ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనాస్థలికి చేరుకొని ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ గోడౌన్ లో కూలర్ల తయారీకి సంబంధించిన సామగ్రి నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగతో పాటు మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories