ధరణి సర్వేపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి : మర్రి శశిధర్‌రెడ్డి

ధరణి సర్వేపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి : మర్రి శశిధర్‌రెడ్డి
x
Highlights

న్యాయంగా ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్‌ ఎన్నికల కో ఆర్డినేషన్‌ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన...

న్యాయంగా ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్‌ ఎన్నికల కో ఆర్డినేషన్‌ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల రిజర్వేషన్‌ ప్రభుత్వం సరిగా నిర్వహించడంలేదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తాము అడిగిన సమాచారం ఇవ్వాలని సవాల్‌ చేశారు. బీజీ ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు జరగడం లేదని ఆయన అన్నారు. ధరణి సర్వేపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.

వార్డు విభజనలో గతంలో జరిగిన విధానాన్ని అడిగితే ఇప్పటి వరకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యలో సమగ్రకుటుంబ సర్వే చేశారు ఇప్పుడేమో ధరణి సర్వే అంటున్నారు. అసలు ఆ సర్వే మతలబేంటని ప్రశ్నించారు. 2021 ఫిబ్రవరి వరకు జీహెచ్‌ఎంసీ కాలపరిమితి ఉన్నా, ఆగమేఘాల మీద అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓటర్లు చాలా అసంతృప్తితో ఉన్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్‌ఎస్‌కు భారీ ఓటమి తప్పదని శశిధర్‌ అన్నారు. ఇక పోతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఓ వైపు జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, మరో వైపు దుబ్బాక బై ఎలక్షన్లు జరుగనున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీల నాయకులు ఎవరికి వారు ఎన్నికల్లో గెలిచేందుకు పోటీ పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories