Maoist Parties in Telangana Calls State Bundh: వరవరరావు విడుదల డిమాండ్‌తో...

Maoist Parties in Telangana Calls State Bundh: వరవరరావు విడుదల డిమాండ్‌తో...
x
Varavara Rao (File Photo)
Highlights

Maoist Parties in Telangana Calls State Bundh : ఓ కేసు విషయంలో జైలుపాలైన విరసం నేత వరవరరావు ప్రస్తుతం కరోనా బారిన పడి ముంబయిలోని ఓ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Maoist Parties in Telangana Calls State Bundh : ఓ కేసు విషయంలో జైలుపాలైన విరసం నేత వరవరరావు ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడి ముంబయిలోని ఓ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు రాష్ట్ర కమిటీ జులై 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఎన్‌ఐఏ నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కోరింది. వరవరరావుపై మోపిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. అంతేకాక అడవుల్లో గస్తీ కాస్తున్న గ్రేహౌండ్స్ బలగాలను అక్కడి నుంచి ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ బహిరంగ లేఖలో డిమాండ్ చేసింది.

ఇక పోతే తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు ఏరియా కమిటీలను సీపీఐ (మావోయిస్ట్) పార్టీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా మావోలు రెండ్రోజుల క్రితం ఓ లేఖను కమిటీలను ప్రకటిస్తూ మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏడుగురు సభ్యులతో ప్రకటించారు. హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బండి ప్రకాష్, దామోదర్, భాస్కర్, సాంబయ్య, పుల్లూరి ప్రసాద్, హరిభూషణ్, కంకణాల రాజిరెడ్డితో తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు పర్యవేక్షణలో రాష్ట్రకమిటీ పనిచేస్తుందని లేఖలో పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories