నేటినుంచి మావోయిస్టుల వారోత్సవాలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హై అలెర్ట్

నేటినుంచి మావోయిస్టుల వారోత్సవాలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హై అలెర్ట్
x
Highlights

డీజీపీ ఆదేశాల మేరకు ఇప్పటికే గ్రేహౌండ్స్ బలగాలు, బాంబు స్కాడ్స్ సిబ్బంది. ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకున్నాయి. మావోల ఆచూకీ కోసం పోలీసు బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి..

నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జగన్ పేరిట లేఖ విడుదల అయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు. మావోయిస్టులు భారీ విధ్వంసం చేసేందుకు సిద్దమయ్యారని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లాలో పోలీసులను అపప్రమత్తం చేశారు డిజిపి మహేందర్ రెడ్డి. డీజీపీ ఆదేశాల మేరకు ఇప్పటికే గ్రేహౌండ్స్ బలగాలు, బాంబు స్కాడ్స్ సిబ్బంది. ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకున్నాయి. మావోల ఆచూకీ కోసం పోలీసు బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి.. అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీస్ పికెటింగ్స్ ఏర్పాటు.. వాహనాల తనిఖీ చేయడం తోపాటు అనుమానితులను పోలీసులు ఆధుపులోకి తీసుకుంటున్నారు.

ఇక ఇంటెలిజెన్స్, ఐబీ అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు వరంగల్ రేంజ్ ఐజి ప్రమోద్ కుమార్. గొత్తికోయ గూడెంలలో ఉండే ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు.. కొత్తవారికి షెల్టర్ ఇవ్వొద్దని ఆదివాసీలను ఆదేశించారు. మరోవైపు రెండు రోజుల క్రితం చర్ల మండలం కలివేరు - తేగడ గ్రామాల నడుమ మావోయిస్టుల సంచారం కలకలం సృష్టిస్తోంది. చర్ల - భద్రాచలం ప్రదాన రహదారి పక్కనే మూడు మందుపాతరలను అమర్చారు మావోయిస్టులు. అయితే బాంబ్ స్కాడ్ ఆద్వర్యంలో మూడు మందుపాతరలను వెలికితీసి నిర్వీర్యం చేశారు పోలీసులు. ఇదిలావుంటే నేటి నుంచి ఈనెల 27 వరకు మావోయిస్టుల వారోత్సవాలను ఘణంగా జరుపుకోవాలని మావోలు పిలుపునిచ్చారు. అటు పోలీసుల హెచ్చరికలు, ఇటు మావోయిస్టులు వారోత్సవాల పిలుపులతో ఏజెన్సీలో అలజడి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories