‎Mancherial: ఈదురుగాలులకు నేలరాలిన మామిడి.. రైతుల ఆవేదన

Mangoes that fell to the Ground due to strong winds in ‎Mancherial district
x

‎Mancherial: ఈదురుగాలులకు నేలరాలిన మామిడి.. రైతుల ఆవేదన

Highlights

‎Mancherial: తీవ్ర నష్టం వాటిల్లిందంటోన్న మామిడి రైతులు

‎Mancherial: తెలంగాణలో రాత్రి వీచిన ఈదురుగాలులకు పలు జిల్లాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వీచిన ఈదురుగాలుల కారణంగా మామిడికాయలు నేలరాలిపోయాయి. నేలరాలిన మామిడితో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మిగతా పంటలతో పాటు మామిడి పంటను కూడా వేల ఎకరాల్లో సాగుచేస్తున్నట్లు రైతులు తెలిపారు.

జిల్లాలో మామిడికి మార్కెట్ యార్డ్ లేకపోవడంతో సరైన మద్దతు ధర రావడంలేదంటున్నారు రైతులు. దీంతో పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మామిడికి మద్దతు ధర ప్రకటించడంతో పాటు జిల్లాలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఇక పంట నష్టంపై ప్రభుత్వం అధికారులతో సర్వే చేయించి పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories