Medak: వింత వివాహం.. ఒకే యువకుడికి అక్కాచెల్లెళ్లతో పెళ్లి

Man Marries Two Sister in Medak District
x

Medak: వింత వివాహం.. ఒకే యువకుడికి అక్కాచెల్లెళ్లతో పెళ్లి

Highlights

Medak: మెదక్‌ జిల్లాలో వివాహంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

Medak: మెదక్‌ జిల్లాలో వివాహంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఒకే యువకుడికి అక్కాచెల్లెళ్లను ఇచ్చి పెళ్లి జరిపించారు. ఒకే రోజు, ఒకే పెళ్లి మండపంలో ఇద్దరి మెడలో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచాడు వరుడు. అయితే పెళ్లి తర్వాత మాత్రం ఒకరినే తనవెంట తీసుకెళ్లాడు పెళ్లికొడుకు.

కొల్చారం మండలం అంసాన్‌పల్లికి చెందిన గొల్పల వెంకటేష్‌కు స్వాతి, శ్వేత ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె స్వాతికి తన మేనబావ అయిన బాలరాజుతో వివాహం చేయాలనుకున్నారు. అయితే స్వాతి సోదరి శ్వేతకు మతిస్థిమితం సరిగాలేదు. దీంతో ఆమెను భవిష్యత్తులో వేరొకరికి ఇచ్చి వివాహం చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించిన తల్లిదండ్రులు శ్వేతను కూడా బాలరాజుకు ఇచ్చి పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు. ముందుగా స్వాతిని ఒప్పించి, అనంతరం బాలరాజు తల్లిదండ్రులతో చర్చించారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో ముహూర్తం సమయానికి ఇద్దరి మెడల్లో మూడు ముళ్లు వేశాడు బాలరాజు. అయితే పెళ్లి తంతు ముగిసిన తర్వాత స్వాతిని మాత్రమే బాలరాజుతో పాటు అత్తారింటికి పంపించారు. శ్వేతను తమ దగ్గరే ఉంచుకున్నారు తల్లిదండ్రులు.

Show Full Article
Print Article
Next Story
More Stories