Bhadradri: ఇద్దరమ్మాయిల్ని పెళ్లాడిన సత్తిబాబు.. భయంతో ముహూర్తానికంటే ముందే..

Bhadradri: ఇద్దరమ్మాయిల్ని పెళ్లాడిన సత్తిబాబు.. భయంతో ముహూర్తానికంటే ముందే..
x

Bhadradri: ఇద్దరమ్మాయిల్ని పెళ్లాడిన సత్తిబాబు.. భయంతో ముహూర్తానికంటే ముందే..

Highlights

Triangle Love Story: ఇద్దరు భామల ముద్దుల పెళ్ళికొడుకు, ఒకే పందిరి లో ఇద్దరు అమ్మాయిలను ఒకే ముహూర్తానికి పెళ్లాడాడు.

Triangle Love Story: ఇద్దరు భామల ముద్దుల పెళ్ళికొడుకు, ఒకే పందిరి లో ఇద్దరు అమ్మాయిలను ఒకే ముహూర్తానికి పెళ్లాడాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తి బాబు దోసిళ్ళ పల్లి గ్రామానికి చెందిన స్వప్న కుమారిని, కుర్నవల్లి గ్రామానికి చెందిన సునీత‌ని ఒకే పందిరిలో తాళి కట్టాడు. గతం‌లో సత్తిబాబు, స్వప్న కుమారి ఇద్దరు ఒకే కాలేజీ‌లో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోకుండానే సహజీవనం సాగించారు. ఈ క్రమంలో వీరికి పాప జన్మించింది. వీరి సహజీవనానికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో వారిద్దరూ కొంత కాలంగా విడివిడిగా వుంటున్నారు. ఈ క్రమంలో సత్తి బాబు‌కి కుర్నపల్లి గ్రామానికి చెందిన సునీత‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈలోగా ఇద్దరికీ ఒక సంతానం కలిగింది. విచిత్రం ఏంటంటే సునీత తో కూడా వివాహమవ్వలేదు.

పెళ్లి అయితేనే బాగుంటుందని వారి కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షం లో వారి కుల ఆచారం ప్రకారం పంచాయితీ నిర్వహించి అమ్మాయి మెడలో తాళి కట్టించాలని తీర్మానించారు. ఈ విషయం తెలుసుకున్న మొదటి అమ్మాయి స్వప్న తల్లి తండ్రులు కూడా పట్టు పట్టడంతో ఇద్దరికీ అన్యాయం జరగకుండా ఉండాలంటూ ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని పెద్ద మనుషులు తీర్మానించారు. దీంతో ఒకే ముర్తానికి పెళ్లి జరిపించాలని నిర్ణయించారు.

ఈ పెళ్లి తంతు మొత్తం వారి ఆచారం ప్రకారం అబ్బాయి ఇంటి దగ్గర మేళతాలాలు భాజభజంత్రీలు, బందువుల ఆనందోత్సాహాల నడుమ జరిగింది. ఒకే ముహూర్తానికి సత్తిబాబు, స్వప్న, సునీతల మెడలో తాళికట్టడంతో ముగ్గురి ప్రేమకధ సుఖాంతమైంది. కాగా పెళ్లి గురువారం ఉదయం 7 గంటలకు జరగాల్సిఉండగా మీడియా, సోషల్ మీడియాలో ఈ విషయమై విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో పెళ్లి ఆగిపోతుందేమోనన్న భయంతో పెద్దలు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పెళ్లి కుమారుడితో స్వప్న, సునీతల మెడలో తాళికట్టించారు. వివాహతంతును కవర్ చేసేందుకు గురువారం ఉదయం మీడియా గ్రామానికి వెల్లిన సమయంలో పెళ్లి పందిరి ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories