ACB Raids: లంచం తీసుకుంటూ దొరికిపోయిన నేత.. రూ.5 లక్షలు తగలబెట్టి..!
ACB Raids: చేసింది వెదవ పని. పైగా దొరికిపోతాననే భయం ఒకటి. ఆ భయంతోనే లక్షలాది డబ్బును మంటల్లో తలగబెట్టే ప్రయత్నం చేశాడు ఓ అవినీతి పరుడు.
ACB Raids: చేసింది వెదవ పని. పైగా దొరికిపోతాననే భయం ఒకటి. ఆ భయంతోనే లక్షలాది డబ్బును మంటల్లో తలగబెట్టే ప్రయత్నం చేశాడు ఓ అవినీతి పరుడు. కాదు, కాదు, మాజీ వైస్ ఎంపీపీ. నలుగురికి మంచి చేయాల్సిన బాధ్యత గల పదవిలో ఉండి ఆ పదవికే నల్లటి మచ్చ తీసుకొచ్చాడు. అందరిలో అభాసుపాలైయ్యాడు.
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ తహసీల్దార్ సైదులు నివాసంలో సోదాలు చేపట్టారు. క్రషర్ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి 6 లక్షలు డిమాండ్ చేశాడు సైదులు. అయితే సైదులు స్థానంలో 5 లక్షలు లంచం తీసుకున్నాడు మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడ్. ఇక అదే సమయంలో ఏసీబీ అధికారులు రావడంతో 5 లక్షలకు నిప్పు పెట్టాడు వెంకటయ్య గౌడ్. మంటలను ఆర్పిన అధికారులు వెంకటయ్య గౌడ్‌ను విచారిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire