Snake in mouth: పామును నోట్లో పెట్టుకుని రీల్స్ వీడియో.. తెలంగాణలో యువకుడి మృతి

Snake in mouth: పామును నోట్లో పెట్టుకుని రీల్స్ వీడియో.. తెలంగాణలో యువకుడి మృతి
x
Highlights

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న పిచ్చి కొంతమందికి ప్రాణాల మీదికి తెస్తే... ఇంకొంత మందికి ప్రాణాలు తీస్తోంది. గత వారం ఒక యువతి వాటర్ ఫాల్స్ వద్ద రీల్స్...

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న పిచ్చి కొంతమందికి ప్రాణాల మీదికి తెస్తే... ఇంకొంత మందికి ప్రాణాలు తీస్తోంది. గత వారం ఒక యువతి వాటర్ ఫాల్స్ వద్ద రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న విషయం ఇంకా తెరమరుగు కానేలేదు అప్పుడే మరో యువకుడు రీల్ షూటింగ్ కోసం నాగుపాముతో చెలగాటమాడి అదే పాము కాటుకు బలయ్యాడు.

నాగుపాముతో పరాచికాలాడి యువకుడు ప్రాణం పోగొట్టుకున్న ఘటన జరిగింది మరెక్కడో కాదు.. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశిపేట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆ యువకుడి పేరు శివరాజ్. శివరాజ్ నీ ఈ దుస్సాహసానికి ప్రేరేపించింది ఇంకెవరో కాదు.. స్వయంగా అతడి తండ్రే ఈ పిచ్చి పనికి ప్రోత్సహించాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో శివరాజ్ నాగు పామును తన నోట్లో పెట్టుకొని విన్యాసాలు చేయబోయాడు. ఈ తతంగం మొత్తాన్ని శివరాజ్ తండ్రి వీడియో తీస్తున్నాడు. కానీ బుసలు కొట్టే ఆ నాగరాజు కోపాన్ని ఈ శివరాజు కంట్రోల్ చేయగలడా చెప్పండి!!

ఈ స్టంట్ లో మొత్తానికి పాము కాటుకు గురైన శివరాజ్ చివరకు ప్రాణాలోదిలాడు. శివరాజ్ నోట్లో ఉన్నంతసేపు ఆ పాము గిలగిల కొట్టుకోవడం మనం వీడియోలో చూడొచ్చు.

శివరాజ్, అతడి తండ్రి పాములు పట్టుకుని పొట్టపోసుకుంటున్నారు. అందులో భాగంగానే పట్టుకున్న ఈ పెద్ద నాగుపాముని శివరాజ్ తండ్రే అతడికి అప్పగించి ఈ స్టంట్ చేయాల్సిందిగా అక్కడి స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ స్నేక్ స్టంట్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ శివరాజ్ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పాములని అయితే పట్టుకుని బతుకుబండి లాక్కొచ్చారో.. చివరకు అలాంటి పాము కాటుకే బలై తనువు చాలించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories