Malreddy Rangareddy: నిండు సభలో సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారు

Malreddy Rangareddy Comments On KCR
x

Malreddy Rangareddy: నిండు సభలో సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారు

Highlights

Malreddy Rangareddy: భూదందాల కోసం కిషన్ రెడ్డిని గెలిపించుకున్నారు

Malreddy Rangareddy: అవినీతి పరుడిని ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ పొగడటం దారుణమని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. కేసీఆర్ బహిరంగసభలో మాట్లాడిన అంశాలపై మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపణాస్త్రాలు సంధించారు. ఫార్మా తదితర భూ దందాల కోసం.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కేసీఆర్ గెలిపించుకున్నాడని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం చెరువును కృష్ణా జలాలతో నింపామని నిండు సభలో ముఖ్యమంత్రి హోదాలో అబద్దాలు చెప్పారని ఆయన ఆరోపించారు.

చెరువును నింపారో... అందులో మట్టిని అమ్ముకున్నారో.. ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలకు తెలుసన్నారు. కోహెడ పండ్ల మార్కెట్ నిర్మించిన కొద్ది రోజుల్లోనే కూలిపోయిందని ఆరోపించారు. ఇబ్రహీంపట్నానికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని అబద్ధాలు చెప్పారని, ఎక్కడ శంకుస్థాపన చేశారో చూయించాలన్నారాయన... బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్న ఆయన.. తెలంగాణలో... ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories