Mahankali Bonalu Festival 2020: అమ్మలగన్నమ్మ పెద్దమ్మ తల్లికి నేడు బంగారు బోనం

Mahankali Bonalu Festival 2020: అమ్మలగన్నమ్మ పెద్దమ్మ తల్లికి నేడు బంగారు బోనం
x
Peddama Temple bonam
Highlights

Mahankali Bonalu Festival2020: హైదరాబాద్ నగరంలో అమ్మవార్లకు ఆశాఢబోనాలు సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.

Mahankali Bonalu Festival: హైదరాబాద్ నగరంలో అమ్మవార్లకు ఆశాఢబోనాలు సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 11–30 గంటలకు జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి అమ్మవారికి భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు పాత్రలో బోనం సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జె.మధుసూదన్‌గౌడ్‌ మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మవార్లకు జరిగే ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఏడు దేవాలయాల అమ్మవార్లకు కమిటీ ఆధ్వర్యంలో ఏడు బంగారు బోనాలను సమర్పిస్తున్నామన్నారు. చార్మినార్‌ భాగ్యలక్ష్మీ దేవాలయం, లాల్‌దర్వాజా సింహవాహిణి, గోల్కోండ, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి, పెద్దమ్మ దేవాలయం, బల్కంపేట్‌ ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, దేవాలయం అమ్మవార్లకు సప్త మాతృకల సప్త బంగారు బోనం పేరుతో బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించడానికి కార్యాచరణను రూపొందించామన్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ గురువారం ఉదయం 9.30 గంటలకు ఉప్పుగూడ మహాంకాళి దేవాలయంలో పూజలు నిర్వహించన్నారు. అనంతరం పట్టు వస్త్రాలతో పాటు బోనాన్ని బంగారు పాత్రలో తీసుకెళ్లి పెద్దమ్మ తల్లి అమ్మవారికి సమర్పించనున్నామన్నారు. ఇప్పటికే గోల్కొండ జగదాంబ అమ్మవారికి, విజయవాడ కనక దుర్గమ్మ తల్లి, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, బంగారు పాత్రలో బోనానంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిçస్తూ పరిమిత సంఖ్యలో దేవాలయానికి వెళుతున్నట్లు ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories