Mahabubabad: మానవత్వం చాటుకున్న మహబూబాబాద్‌ జిల్లా పోలీసులు

Mahabubabad District Police Showing His Humanity
x
ఆక్సిడెంట్ అయిన వారికీ సహాయం చేసిన పోలీసులు(ఫైల్ ఇమేజ్)
Highlights

Mahabubabad: జిల్లా కేంద్రంలో రెండు వేర్వేరు ఘటనలు * కే సముద్రం మండలం రాజీవ్‌నగర్‌లో ట్రాక్టర్‌-బైక్ ఢీ

Mahabubabad: కరోనా మహమ్మారి మానవ సంబంధాలను మంటకల్పింది. సొంత తల్లిదండ్రులు వైరస్‌ బారిన పడితే దగ్గరుండి చూసుకోలేని పరిస్థితులను తీసుకొచ్చింది. అంతేకాదు.. కోవిడ్‌ సమయంలో చావు బతుకుల్లో ఉన్న సొంతవాళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లి చూసే వీలులేదు. అసలు.. కరోనా అన్న మాట వింటేనే పై నుంచి కింద వరకు గజగజలాడాం. వైరస్‌ లక్షణాలు ఉన్న వ్యక్తి కనిపిస్తే చాలు.. ఏదో భూతాన్ని చూసినట్టు పరుగులు పెట్టే పరిస్థితులు. ఆఖరికి సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన అంత్యక్రియల రూపురేఖలను సైతం మార్చేసింది ఈ డెడ్లీ వైరస్‌.

ఇలాంటి విపత్కర సమయంలో తమ మంచి మనసును చాటుకుంటున్నారు మహబూబాబాద్‌ పోలీసులు. కే సముద్రం మండలం రాజీవ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమేష్‌బాబు.. క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించుకొని ఆస్పత్రికి తరలించారు.

ఇలాంటి ఘటనే మరొకటి మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ స్పృహ తప్పి కిందపడిపోయింది. అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న మహబూబాబాద్‌ టౌన్‌ ఎస్సై అరుణ్‌, తన సిబ్బందితో కలిసి.. రోడ్డుపై పడిఉన్న మహిళను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. వివరాలు తెలుసుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజలు ఎస్సైలు రమేష్‌బాబు, అరుణ్‌ను అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories