హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు మాదాపూర్ పోలీసుల వార్నింగ్.. అనుమతి లేకుండా ధర్నాలు చేస్తే కఠిన చర్యలు

Madhapur Police Warning to IT Employees in Hyderabad
x

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు మాదాపూర్ పోలీసుల వార్నింగ్.. అనుమతి లేకుండా ధర్నాలు చేస్తే కఠిన చర్యలు

Highlights

Chandrababu Arrest: చంద్రబాబుకు అనుకూలంగా నిరసనలకు ప్లాన్ చేసిన ఐటీ ఉద్యోగులు

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఉద్యోగుల నిరసనలపై మాదాపూర్ పోలీసులు స్పందించారు. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్‌లో పబ్లిక్ న్యూసెన్స్, ధర్నాలు చేస్తున్నవారికి హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.

పర్మిషన్ లేకుండా రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించి ట్రాఫిక్‌కు కారణం కావొద్దన్నారు. ప్రధాన రోడ్లు, ఓఆర్ఆర్‌లపై ధర్నాలకు ప్లాన్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధర్నాలు చేసి విధ్వంసం సృష్టించాలని చూస్తే ఐటీ ఉద్యోగులు పనిచేసే సంస్థలకు నోటీసులు అందచేస్తామని హెచ్చరించారు. కాగా గత రెండ్రోజులుగా చంద్రబాబును అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఐటీ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories