తెలంగాణలో విస్తరిస్తున్న మరో వైరస్..భయం గుప్పిట్లో రైతులు

తెలంగాణలో విస్తరిస్తున్న మరో వైరస్..భయం గుప్పిట్లో రైతులు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Lumpy Skin Disease : అసలు ఏమైంది ఈ తెలంగాణ రాష్ట్రానికి 2020 ఏడాదిలో. ఒక వైపు చూస్తే భారీగా విస్తరిస్తున్న కరోనా కేసులు, మరో వైపు వారం రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు.

Lumpy Skin Disease : అసలు ఏమైంది ఈ తెలంగాణ రాష్ట్రానికి 2020 ఏడాదిలో. ఒక వైపు చూస్తే భారీగా విస్తరిస్తున్న కరోనా కేసులు, మరో వైపు వారం రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు. ఈ రెండింటితోనే రాష్ట్ర ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఇప్పుడు మరో కొత్త వైరస్ తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. అది ఏంటంటే లంపీ స్కిన్ అనే డిసీజ్ పశువులను వెంటాడుతోంది. ఒక మూగజీవి నుంచి ఈ వైరస్ మరో మూగజీవికి అతి వేగంగా వ్యాప్తి చెందడం, పశువైద్యశాలల్లో ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది కొరత, మందులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్ ఇంతకు ముందే మే-జూన్ నెలల్లో వనపర్తి జిలాల్లో విజృంభించి ఎన్నో జంతువులను అంటింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వైరస్ ఆదిలాబాద్ జిల్లాలో విజృంభిస్తూ జిల్లా రైతాంగాన్ని వణికిస్తోంది.

ఈ వ్యాధి బారిన పడిన మూగజీవాల చర్మంపై బొబ్బలు, బొడిపెలు వస్తున్నాయి. గత 40 రోజులుగా విస్తరిస్తున్న ఈ వైరస్ బారిన ఎక్కువగా ఆవులు, ఎద్దులు, దూడలకు సోకుతోంది. అయితే ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తించి వాటికి చికిత్స అందిస్తే వ్యాధిని సులువుగా నయం చేయొచ్చు. ఇక ఈ వ్యాధి బారిన పడిన ఒక్కో పశువుకు రూ.1500 వరకు ఖర్చు చేసి మందులు కొనుగోలు చేయడం రైతులకు భారంగా మారింది. ప్రభుత్వ పశువైద్యశాలల్లో దీనికి సంబంధించిన మందులు, టీకాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఈ ఇబ్బందులను ఎదుర్కొవలసిన అవసరం ఉంది. ఇప్పటికే తలమడుగులో ఆదివారం ఒక ఎద్దు లంపీ స్కిన్ కారణంగా చనిపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం వరకు ప్రభుత్వం మందులు సరఫరా చేసింది. పశువైద్యశాలల్లో సిబ్బంది కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ వైరస్ కారణంగా జూన్ నెలలో వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకోలులో కొద్ది రోజుల వ్యవధిలోనే 11 మూగ జీవాలు లంపీ స్కిన్ డిసీజ్ కారణంగా చనిపోయాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories