తెలంగాణలో లక్కీ నెంబర్ల రాజకీయం.. ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారా?

Lucky Numbers Politics in Telangana
x

తెలంగాణలో లక్కీ నెంబర్ల రాజకీయం.. ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారా?

Highlights

Lucky Numbers: తెలంగాణ రాజకీయాలను సంఖ్యాశాస్త్రం శాసిస్తోందా?

Lucky Numbers: తెలంగాణ రాజకీయాలను సంఖ్యాశాస్త్రం శాసిస్తోందా? ప్రధాన పార్టీలను నడిపిస్తున్న ఇద్దరు అధినేతలు తమ లక్కీ నెంబర్లను సెంటిమెంట్‌ అస్త్రంగా నమ్ముతున్నారా? ఉద్యమ సమయంలో నెంబర్‌ గేమ్‌ ఆధారంగా వ్యూహాలను ఓ పార్టీ రచిస్తే అదే బాటలో మరో పార్టీ అదే నెంబర్‌ సెంటిమెంట్‌తో రాజకీయ ఎత్తుగడలు వేస్తోందా? ఇంతకి పొలిటిక్స్‌లో నడుస్తున్న ఈ నెంబర్ల గేమ్‌ ఏంటి? నమ్ముతున్నది ఎవరు? సంఖ్యాబలంతో సభలు ఏర్పాటు చేస్తున్నది ఎవరు?

టీఆర్ఎస్‌. తెలంగాణ రాష్ట్ర సమితి. ఉద్యమ సమయం నుంచి సెంటిమెంట్‌ను పండిస్తూ ఉవ్వెత్తిన ఎగిసిన నేటి రాజకీయ పార్టీ. నాడు, నేడు పార్టీ అధినేతగా, సాధించుకు తెచ్చుకున్న తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్న కేసీఆర్‌‌కు ఆరో నెంబరు అదృష్టసంఖ్య. 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ పోరాటం నుంచి నేటి వరకూ కేసీఆర్ ఏ కార్యం చేసినా ఆరు నెంబరు కలిసి వచ్చే తేదీలనే ఎంచుకుంటారు. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. అలా కార్యక్రమాలను డిజైన్‌ చేయడం ఆయనకే కాదు యావత్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆనవాయితీగా వస్తోంది. ఉద్యమ సమయం నుంచి, అదే నెంబర్‌తో సక్సెస్‌ అయిన సీఎం కేసీఆర్‌ అదే సెంటిమెంట్‌ను నమ్ముతున్నారు.

టీఆర్ఎస్‌ అధినేత అంచనాలు, లెక్కలు ఇలా ఉంటే ఇదే నెంబర్‌ సెంటిమెంట్‌తో రాజకీయ ఎత్తుగడలు రచిస్తున్నారు టీ-పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. కేసీఆర్ ఆరోనెంబరు లక్కీ నెంబర్‌ అయితే, తనకు తొమ్మిదో నెంబరు కలసి వస్తుందని చెప్పుకుంటున్నారట రేవంత్. 9వ నెంబరు కలిసి వచ్చేలా చూసుకునే తాను పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌గా తాను తొలిసారి పర్యటించిన నిర్మల్‌ టూర్‌ను తొమ్మిదో తేదీనే ప్రారంభించారు. ఇప్పుడే కాదు గతంలో కూడా తానేం చేసినా 9వ నెంబరునే అదృష్ట సంఖ్యగా భావిస్తారని, అదే నెంబర్‌ గేమ్‌తో, ఆ నెంబర్‌ సెంటిమెంట్‌తోనే టీఆర్ఎస్‌ను ఢీకొట్టడానికి మళ్లీ తొమ్మిదోనెంబర్‌నే ఎంచుకున్నారని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు.

ముందస్తు ఎన్నికల కోసం క్యాడర్‌ను ప్రిపేర్ చేయడానికి సీఎం కేసీఆర్‌ వరంగల్‌ సభను ఎంచుకున్నారని చెబుతున్నారు విశ్లేషకులు. ఆయనకు కలసి వచ్చేలా లక్కీ నెంబర్ తేదీ నవంబర్ 15న ప్రజగర్జన సభను వరంగల్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజే ఎన్నికల శంఖారావం పూరించడానికి సీఎం కేసీఆర్ రెడీ అయ్యారని విపక్షాలు భావిస్తున్నాయి. అందుకే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా తనకు కలసి వచ్చేలా డిసెంబర్ తొమ్మిదో తేదీన హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసుకుంటున్నారట. సీఎం కేసీఆర్ నిర్వహించే సభకు ధీటుగా తెలంగాణ తొలి ప్రకటన వచ్చిన రోజుతో పాటు, అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజు కూడా కావడంతో డిసెంబరు 9ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. మరి, సీఎం కేసీఆర్‌కు 6వ నెంబరు కలసి వస్తుందని ఎలాగైతే నమ్ముతున్నారో రేవంత్‌రెడ్డి కూడా 9వ నెంబరు ఎంతవరకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందో ఈ లక్కీ నెంబర్లు ఎవరికి అధికార లక్ష్మీ కటాక్షం కల్పిస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories