కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
x
Highlights

కాంగ్రెస్‌ అధిష్ఠానం పీసీసీగా ఎవరిని నియమించిన అందరం కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తమ అభిప్రాయాలను తెలియజేశామని ఇక బంతి కాంగ్రెస్‌...

కాంగ్రెస్‌ అధిష్ఠానం పీసీసీగా ఎవరిని నియమించిన అందరం కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తమ అభిప్రాయాలను తెలియజేశామని ఇక బంతి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ చేతిలో ఉందన్నారు. ఇప్పుడు ఎలాంటి కొత్త ప్రతిపాదనలు చేయమని అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని జగ్గారెడ్డి స్పష‌్టం చేశారు. పీసీసీ నియామకంపై ఎలాంటి విమర్శలు ఉండవు. అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలి

కరోనాతో ఆర్థికంగా చితకిపోయిన పరిస్థితుల్లో ఎల్‌ఆర్ఎస్‌ కట్టమనడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎల్‌ఆర్ఎస్‌ విధానాన్ని రద్దు చేయండి అంటూ ప్రభుత్వాన్ని జగ్గారెడ్డి కోరారు. అవసరమైతే రెగ్యులరైజ్ కోసం 10వేల లోపు రుసం వసూలు చేయండి అంటూ విజ్ఞప్తి చేశారు. కానీ ఎల్‌ఆర్ఎస్‌ పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఎల్లుండి గాంధీ భవన్‌ లో ఒక్కరోజు నిరసన దీక్ష చేస్తామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories