Winter - Health Problems: ప్రారంభంలోనే వణికిస్తున్న చలికాలం

Low Temperatures Recorded in Telugu States Causes Health Problems | Telugu Online News
x

Winter - Health Problems: ప్రారంభంలోనే వణికిస్తున్న చలికాలం

Highlights

Winter - Health Problems: ఆస్తమా, గుండెజబ్బులు పేషంట్స్ ని జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు..

Winter - Health Problems: శీతాకాలం మొదలై చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి పూట టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో 13 డిగ్రీలకు పడిపోయింది. రానున్న రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. చలి వల్ల రోగాలు విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇతర రోజులతో పోల్చితే ఈ కాలంలో గుండె సమస్యలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం చలిలో గడిపితే గుండె లోపల రక్తనాళాలు కుచించుకుపోతాయి. ముఖ్యంగా వేకువజామున 4 నుంచి 6 గంటల మధ్య, రాత్రి సమయాల్లో బయట తిరిగే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

చలి కాలంలో ఆహారం, తాగే నీటి ద్వారా అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ఈ కాలంలో గోరువెచ్చని నీటిని తాగడం మంచిదంటున్నారు. చిన్న పిల్లలపై నిమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులు దాడిచేస్తాయి. నెలలు నిండని శిశువులు, అప్పుడే పుట్టిన పిల్లలను తరచూ తాకే తల్లిదండ్రులు లేదా ఇతరులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని చెబుతున్నారు.

చేతులను సబ్బుతో కడుక్కున్న తర్వాతే పట్టుకోవాలని సూచిస్తున్నారు. వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, మధుమేహం, క్యాన్సర్‌ ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, అవయవ మార్పిడి చేయించుకున్న వారు చలి కాలంలో త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు వైద్యుల సలహాతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories