రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపు...కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపు...కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసిఆర్ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించారు. జూన్ 30 వరకు పొడిగించిన లాక్ డౌన్ ముఖ్యంగా...

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసిఆర్ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించారు. జూన్ 30 వరకు పొడిగించిన లాక్ డౌన్ ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్లకు వర్తించనుంది.

కంటైన్మెంట్ జోన్లో లేని ప్రాంతాలలో జూన్ 7వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌కు సంబంధించి జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ఆదివారం సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న నిషేధం ఎత్తివేశారు. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేసినట్లయ్యింది. రాత్రి 8 గంటల వరకు మాత్రమే షాపులను తెరిచి ఉంచాలని నిర్దేశించారు. ఆస్పత్రులు, మందుల దుకాణాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

కేసులు అత్యధికంగా నమోదవుతున్న కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories