Liquor Sales: కొత్త ఏడాదికి కిక్కుతో స్వాగతం.. ఎంత తాగారో తెలుసా?

Liquor Sales hit Record High in Telangana On The Occasion Of New Year 2025
x

Liquor Sales: కొత్త ఏడాదికి కిక్కుతో స్వాగతం.. ఎంత తాగారో తెలుసా?

Highlights

Liquor Sales: కొత్త ఏడాదికి తెలంగాణలో రూ.403 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్ లో 3,523 కోట్ల మద్యం అమ్ముడైంది.

Liquor Sales: కొత్త ఏడాదికి తెలంగాణలో రూ.403 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్ లో 3,523 కోట్ల మద్యం అమ్ముడైంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం విక్రయాలు తగ్గాయి.

2023 డిసెంబర్ నెలలో చివరి ఐదు రోజుల్లో రూ. 1800 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 30న 3,82,265 మద్యం అమ్ముడైంది. ఇక 3, 96, 114 బీర్లు విక్రయించినట్టు ఎక్సైజ్ శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

డిసెంబర్ లో సగటున రోజుకు రూ. 117 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. కానీ, డిసెంబర్ 30న మాత్రం నాలుగు రెట్లు విక్రయాలు జరిగాయి. 2022 డిసెంబర్ నెల చివరి ఆరు రోజులతో సమానంగా 2023 డిసెంబర్ నెల చివరి ఆరు రోజుల్లో దాదాపు సమానంగా మద్యం విక్రయాలు జరిగాయి.

అయితే 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు పడిపోయాయి. అంతకు ముందు ఏడాదిలో డిసెంబర్ లో రూ.4,147.18 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024 డిసెంబర్ లో మాత్రం రూ.3,523 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి.

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగర వ్యాప్తంగా 1184 కేసులు నమోదయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్ లో 236, సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179, సౌత్ వెస్ట్ జోన్ లో 179, నార్త్ జోన్ లో 177, సెంట్రల్ జోన్ లో 102 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో దసరా పండుగ సమయంలో కూడా మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. గత కొన్నేళ్లుగా న్యూ ఇయర్ సమయంలో కూడా మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories