Kamareddy: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో చిరుత సంచారం

Leopard Wandering in Nizam sagar Kamareddy District
x

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో చిరుత సంచారం(ఫైల్ ఫోటో) 

Highlights

*నవోదయ విద్యాలయం ప్రాంతాల్లో చిరుత సంచారం *ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పర్యాటకులు కనిపించిన చిరుత

Kamareddy: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాలతో పాటు హాసన్‌పల్లి హెడ్‌స్లూయిస్, నవోదయ విద్యాలయం ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పర్యాటకులు తిరిగి వెళ్తుండగా చిరుత సంచారాన్ని గమనించారు. దీంతో పర్యాటకులు కారును ఆపి, డోర్లు లాక్ చేసుకుని చిరుత కదలికలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

ఈ ప్రాంతం లో చిరుత సంచారం కొత్తేమీ కాదు. గతంలో హాసన్‌పల్లి గ్రామ అటవీ ప్రాంతంలో గొర్రెలను చంపేసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. పలు మార్లు ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలో చిరుత కాలి ముద్రలు గుర్తించి చిరుత సంచారిస్తున్నట్లు గుర్తించారు. ప్రాజెక్ట్ పర్యాటకులకు చిరుత తారసపడడంతో ఇటు పర్యాటకులు అటు స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories