వ్యవసాయ బావిలో పడిన చిరుత

leopard fell down in a well
x
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని ఓ వ్యవసాయ బావిలో చిరుత పులి పడింది. గ్రామస్తుల...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని ఓ వ్యవసాయ బావిలో చిరుత పులి పడింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను సురక్షితంగా బయటకు తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అయితే గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు ప్రచారం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బావిలోకి దిగేందుకు మెట్లు లేకపోవడంతో వల వేసి తీయాలా లేదా మత్తు మందు ఇచ్చి చిరుతను బయటకు తీయాలా అనే విషయాన్ని అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. ఇక చిరుతను చూసేందుకు పెద్దసంఖ్యలో జనం బావి వద్దకు చేరుకున్నారు. చిరుతను సురక్షితంగా బయటకు తీసి అడవిలో విడిచిపెట్టాలని, అప్పుడే తాము ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories