Left Parties: తెలంగాణలో ప్రాభవం కోల్పోతున్న కామ్రేడ్లు

Left Parties Losing Influence In Telangana
x

Left Parties: తెలంగాణలో ప్రాభవం కోల్పోతున్న కామ్రేడ్లు  

Highlights

Left Parties: వామపక్షాలకు చెరో రెండు సీట్లు కేటాయించే అవకాశం

Left Parties: వామపక్షాలకు ఏమైంది ? ఒకప్పడు చక్రం తిప్పిన వామపక్షాలు పరిస్థితి దారుణంగా ఉందని చెప్పవచ్చు. తెలంగాణలో ఒకప్పుడు వామపక్షాలకు మంచి పట్టు ఉండేది.గెలుపు ఓటములు ప్రభావితం చేసే స్థాయిలో వామపక్షాలు ఉండేవి. కానీ ఇప్పడా పరిస్థితి లేదని చెప్పవచ్చు. బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు వాక్షాలతో పొత్తు పెట్టుకునేందుకు ముందుకు వచ్చేవి. అయితే ఇప్పడా పరిస్థితి లేదని చెప్పవచ్చు.

మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలను కలుపుకొని పోయిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నారు.వామపక్షాలతో పొత్తు లేదనే విషయాన్ని సీఎం చెప్పకనే చెప్పేశారు.కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు లేదంటూ సీఎం కేసీఆర్‌ తేల్చేసిన నేపథ్యంలో వామపక్షాలు కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అవుతున్నాయి. రెండు రెండు సీట్లు చొప్పన కేటాయించే అవకాశముందని తెలుస్తోంది.

గతంలో నిరు పేదల పక్షాన పోరాడుతారనే కాస్తో కూస్తో పేరు ఉండేది. ఇటీవల కాలంలో పోరాటాలు పక్కన పారేసి తమ పబ్బం ఎలా గడుపుకోవాలనే ఆరాటమే వీరిలో ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఖమ్మంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీ ముఖ్య నాయకుడు డబ్బులకు అమ్ముడుపోయి పక్క పార్టీకి సహాయపడినట్లు అదే వామపక్ష పార్తీలకే చెందిన మరో కీలక నాయకుడు విమర్శించారు.

మొన్నటిదాక టీఆర్‌ఎస్‌ను అవినీతి, అక్రమాల పుట్ట అని వేలెత్తి చూపిన వీరు మునుగోడు ఎన్నికల సమయంలో ఆపార్టీకి మద్దతునిచ్చారనే విమర్శలు వస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దమవుతున్నారు.విషయం ఏంటంటే వీరంతా తమ స్వార్థం కోసం ఎవరితోనైనా, ఎప్పు డైనా కలిసి పోతారనీ, సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమి ఉండవనే విమర్శలు వస్తున్నాయి.వామపక్షాల నాయకులు తమ పార్టీల బలోపేతానికి కృషి చేయకుండా పక్క పార్టీల వైపు ఆశగా ఎదురు చూస్తుండడం వీరి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోందనే విమర్శలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories