Harish Reddy: జనసేనతో పొత్తు వద్దంటున్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నేతలు

Leaders of Serilingampally And Kukatpally Who Do Not Want An Alliance With Janasena
x

Harish Reddy: జనసేనతో పొత్తు వద్దంటున్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నేతలు

Highlights

Harish Reddy: ముందు నుంచి పనిచేసిన బీజేపీకి టికెట్‌ ఇవ్వకుండా.. జనసేనకు ఇవ్వాలన్న ఆలోచన సరైంది కాదంటున్న హరీష్‌రెడ్డి

Harish Reddy: తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు.. కమలం పార్టీలో చిచ్చు రాజేస్తోంది. పొత్తులో భాగంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి స్థానాలు.. జనసేనకు ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ ప్రచారంపై తీవ్రంగా మండిపడుతున్నారు కమలనాథులు. జనసేనతో పొత్తు వద్దని కరాకండిగా చెబుతున్నారు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నేతలు. తమ సీట్లు వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు. శేరిలింగంపల్లిలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రవికుమార్‌ యాదవ్. శేరిలింగంపల్లి టికెట్‌ జనసేనకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

శేరిలింగంపల్లి టికెట్‌ రవికుమార్‌కు ఇచ్చేలా ఆయన పావులు కదుపుతున్నారు. ఇక.. కూకట్‌పల్లి టికెట్‌ జనసేనకు ఇవ్వడాన్ని మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు హరీష్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ముందు నుంచి పనిచేసిన బీజేపీకి టికెట్‌ ఇవ్వకుండా.. జనసేనకు ఇవ్వాలన్న ఆలోచన సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories