Ambedkar Statue: హైదరాబాద్‌లో భారీ అంబేద్కర్ విగ్రహం.. చివరి దశకు చేరుకున్న నిర్మాణ పనులు

Largest Ambedkar Statue of 125 feet height being built in Hyderabad Telangana
x

Ambedkar Statue: హైదరాబాద్‌లో భారీ అంబేద్కర్ విగ్రహం.. చివరి దశకు చేరుకున్న నిర్మాణ పనులు   

Highlights

Ambedkar Statue: ఏప్రిల్ 14న జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ

Ambedkar Statue: హైదరాబాద్ నగరంలో దేశ రాజ్యాంగ నిర్మాత, భావి భారత స్ఫూర్తిప్రదాత బాబాసాహెబ్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యం లోనే విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు.

విగ్రహా ఆవిష్కరణకు పనులు దాదాపు ఇప్పటికే పూర్తికాగా , చివరి దశ పనులు అధికారులు చకాచకా పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. అయితే తెలంగాణకే మణిహారంగా నిలవనున్న ఈ విగ్రహం నెక్లెస్‌ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం మరోవైపు అమరుల స్మారకం, ఇంకోవైపు అంబేద్కర్ భారీవిగ్రహం హైదరాబాద్ కు తలమానికంగా నిలవనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories