లారా అదృశ్యం కేసు సుఖాంతం

లారా అదృశ్యం కేసు సుఖాంతం
x
Highlights

తల్లిదండ్రులు మందలించారని ఇంటినుంచి వెళ్లిపోయిన ఇంటర్‌ విద్యార్థిని లారా అదృశ్యం కేసు సుఖాంతమైంది. అక్టోబర్ 7వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిన లారా...

తల్లిదండ్రులు మందలించారని ఇంటినుంచి వెళ్లిపోయిన ఇంటర్‌ విద్యార్థిని లారా అదృశ్యం కేసు సుఖాంతమైంది. అక్టోబర్ 7వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిన లారా ఇంటికి తిరిగిరావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. హయత్‌నగర్‌ తట్టిఅన్నారానికి చెందిన లారా.. తల్లిదండ్రులు మందలించారంటూ తండ్రితో గొడవపడి అలిగి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆరోజు నుంచి ఆమె కుటుంబ సభ్యులు చాలా వెతికారు. అయినా లారా ఆచూకీ దొరకక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.

అంతే కాదు లారాని పట్టుకునేందుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసారు. దాంతో పాటుగానే ఫేస్ బుక్‌లో ప్రత్యేకంగా Find Lara పేరుతో అకౌంట్ క్రియేట్ చేశారు. కుటుంబసభ్యులు చేసే ప్రయత్నాలకు పోలీసులు కూడా ఆమెను వెతకడం కోసం చాలా శ్రమించారు. సీసీ కెమెరా పుటేజ్‌ ఆధారంగా బాలిక జాడ కనుగొనేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం రాలేదు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు లారానే ఇంటికి తిరిగి రావడంతో కేసు సుఖాంతమైంది.

ఇక పోతే లారా రవికుమార్ ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయిందనే విషయానికొస్తే లారా ఇంట్లో ఓ నిబంధన ఉంది. ఆమె ఇంట్లో సెల్ ఫోన్ వాడాలంటే రాత్రి 10 గంటలకు ముందు మాత్రమే పర్మిషన్. అయితే లారా రాత్రి 10 తరువాత మొబైల్ వాడుతుండగా ఆమె తండ్రి మందలించారు. దాంతో లారా అక్టోబర్ 7 తేదీన రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంట్లో ఉన్న మూడు కుక్కలను తీసుకుని బయటకు వెళ్లింది. ఆ తరువాత ఎంతసేపటికీ లారా తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories