సంగారెడ్డి జిల్లా రాయికోడ్ తహశీల్దార్ భూ అక్రమ బాగోతం

Land Dispute Tahsildar Raikode In Sangareddy District
x

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ తహశీల్దార్ భూ అక్రమ బాగోతం

Highlights

Sangareddy: వృద్ధురాలు చనిపోయిందని తప్పుడు రికార్డులు సృష్టి.. 27 ఎకరాల 34 గుంటలు భూమి వేరే మహిళకు రిజిస్ట్రేషన్

Sangareddy: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ తహసీల్దార్ రాజయ్య భూ అక్రమాల బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. రాయికోడ్ మండలం నాగాన్ పల్లి గ్రామానికి చెందిన శివమ్మ అనే వృద్ధురాలు బ్రతికుండగానే చనిపోయినట్లు తహసిల్దార్ రాజయ్య రికార్డులు సృష్టించి తన పేరుపై ఉన్న భూమి పౌతీ మార్పిడికి పాల్పడ్డాడు. కరోనా సమయంలో శివమ్మ భర్త హన్మంతు మృతి చెందాడు.అతనికి 198 వ సర్వే నంబర్ లో 27 ఎకరాల 34 గంటల భూమి ఉంది. దాంతో ఏప్రిల్ లో భర్త పేరుపై ఉన్న 27 ఎకరాల 34 గంటల భూమిని భర్త పేరుపై నుండి తన పేరుపై శివమ్మ రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఈ నెల 19 వ తేది న బ్రతికున్న శివమ్మ ను చనిపోయినట్లు రికార్డ్ సృష్టించారు.

వృద్ధురాలు శివమ్మ చనిపోయిందని ధరణిలో వెబ్ సైట్ లో మార్పులు చేర్పులు చేసి షేరి అంజమ్మపై రిజిస్ట్రేషన్ చేసి సర్వే నంబర్ లో పట్టా భూమి కనబడకుండ తహశీల్దార్ సొంత తెలివి ప్రదర్శించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమానం తో తాహసిల్దర్ ను ఆరా తీసిన శివమ్మ తహసిల్దార్ పై జిల్లా కలెక్టర్ కు అలాగే రాయికోడ్ పోలీసులకు పిర్యాదు చేయడంతో తహసిల్దార్ పని తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories