వైభవంగా సాగుతున్న లాల్‌దర్వాజ బోనాల జాతర.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని

Lal Darwaza Bonalu Fair Going On In Grandeur
x

వైభవంగా సాగుతున్న లాల్‌దర్వాజ బోనాల జాతర.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని

Highlights

Lal Darwaza Bonalu: బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Lal Darwaza Bonalu: హైదరాబాద్‌ భక్తి మయంగా మారింది. తెల్లవారుజామున లాల్‌దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారి సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. అధికారులు ఇప్పటికే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజలోని సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయాలతో పాటు ఆలయాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరాలు కూడా పెట్టి పరిసర ప్రాంతాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సౌత్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏకంగా 4వందల సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. బోనాలు జరగనున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేశారు.

సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. అమ్మవారికి ఆలయ అధికారులు బంగారు బోనం సమర్పించారు.అలాగే ప్రభుత్వం తరుపును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు ఆలయానికి వేసిన రంగులు, అమ్మవారి అలంకరణ, దేవాలయానికి వేసిన విద్యుత్ దీపాలు ఆకట్టుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories