కనిపించడు, వినిపించడు అంతా ఆయనే నడిపిస్తుంటాడట?

కనిపించడు, వినిపించడు అంతా ఆయనే నడిపిస్తుంటాడట?
x
Highlights

కనిపించడు, వినిపించడు అయినా అంతా ఆయనే నడిపిస్తుంటాడట తెలుగు రాష్ట్రాల జీవనాడులు, కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులను సైతం, ఆ ఆత్మే శాసిస్తోందట కేసీఆర్‌,...

కనిపించడు, వినిపించడు అయినా అంతా ఆయనే నడిపిస్తుంటాడట తెలుగు రాష్ట్రాల జీవనాడులు, కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులను సైతం, ఆ ఆత్మే శాసిస్తోందట కేసీఆర్‌, జగన్‌ల మధ్య ఫ్రెండ్లీ వాతావరణంలో జరుగుతున్న వరుస సమావేశాలకూ, ఆయనే కీరోల్‌ ట. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను తెరవెనక డిక్టేట్ చేస్తున్నదెవరు ఆ అదృశ్య శక్తి ఏది?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా రంజుగా సాగుతున్నాయి. రెండు రాష్ట్రాల సీఎంలు తరచుగా సమావేశమవుతున్నారు. విభజన సమస్యలతో పాటు అనేక ఇష్యూలను పరిష‌్కరించేదిశగా చర్చలు జరుపుతున్నారు. రెండు రాష్ట్రాల రాజకీయాలతో పాటు కేంద్ర రాజకీయాలపైనా వ్యూహాలు రచిస్తున్నారు. ఉమ్మడి శత్రువులపై పోరాడేందుకు, పొగబెడుతున్న శక్తులను ఎదుర్కొనేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారట. గత ఐదేళ్లలో అప్పుడప్పుడూ కేసీఆర్‌, చంద్రబాబులు కలిసినా, కోల్డ్‌వార్‌ మాత్రం కంటిన్యూ అయ్యేది. ఎన్నికల నాటికి అది మరింత ముదిరి, చంద్రబాబు కేసీఆర్‌కు ఆయుధమైతే, ఏపీలోనూ కేసీఆర్‌ను అస్త్రంగా ప్రయోగించారు చంద్రబాబు. కానీ తెలంగాణలో కేసీఆర్‌ రెండోసారి అధికారం చేజిక్కించుకుంటే, ఏపీలో చంద్రబాబు చతికిలబడ్డారు, వైఎస్‌ జగన్‌ విజయబావుటా ఎగరేశారు. ఇఫ్పుడు కేసీఆర్‌, జగన్‌లు వరుసగా సమావేశమవుతున్నారు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటున్నారు. అయితే, ఇద్దరు సీఎంల మధ్య ఇంతటి సుహృద్భావం వెనక, అదృశ్య శక్తి ఒకటి వుందన్న వాదన, గట్టిగా వినిపిస్తోంది.

రెండు రాష్ట్రాల మధ్య ఫ్రెండ్లీ వాతావరణమే కాదు, కీలక ప్రాజెక్టుల వెనకా ఆ అదృశ్య శక్తి వుందట. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన సంస్థ, మేఘా. ఇటు ఏపీలోనూ పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లోనూ ఎంటరై, వాటి పనులను దక్కించుకున్నది కూడా మేఘానే. రెండు రాష్ట్రాల్లోనూ కీలక ప్రాజెక్టులను సొంతం చేసుకున్నదీ ఒకే సంస్థ. అదే మేఘా. అయితే దీని వెనకా, కనిపించని అ అదృశ్య శక్తి వుందట.

ఇంతకీ, తెలుగు రాష్ట్రాల రాజకీయాలను, తెర వెనక ఇంతగా ప్రభావితం చేస్తున్న ఆ అదృశ్య శక్తేంటి అనుకుంటున్నారు కేవీపీ. అవును. కేవీపీ రామచంద్రరావు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ఆత్మ. ఇప్పుడు ఇదే ఆత్మ రెండు రాష్ట్రాల్లోనూ, తెర వెనకుండి నడిపిస్తోందన్న వాదన, రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌‌గా సాగుతోంది.

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై చాలా పట్టుదలగా ఉన్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. రివర్స్‌ టెండరింగ్‌తో చాలా డబ్బులు ఆదా అవుతాయని వాదించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం, విమర్శలు దట్టించాయి. ఆదా వుండదూ, ఏమీ వుండదని మండిపడ్డాయి. అయితే, రివర్స్‌ టెండరింగ్‌ సూపర్‌ హిట్టని నిరూపించుకున్నారు జగన్‌. పోలవరం పనులకు 12.6 శాతం తక్కువ కోట్‌ చేస్తూ, మేఘా సంస్థ బిడ్‌ దాఖలు చేయడంతో, ఖజానాకు 782 కోట్లు ఆదా అయ్యాయి. దీంతో డబ్బులు ఆదా అవుతాయన్న తన వాదన నెగ్గించుకున్నారు. అయితే ఇదొక్కటే కాదు, తాను అనుకున్న సంస్థకే కాంట్రాక్టు దక్కడంతో, వైసీపీ నేతలు ఖుషీ అవుతున్నారట. మేఘా సంస్థకు కాంట్రాక్టు దక్కితే, వైసీపీకి ఎందుకంత హ్యాపీ అంటే, మేఘా కంపెనీలో కేవీపీకి షేర్లున్నాయి. పోలవరం పనులు మేఘాకు దక్కడంలో కేవీపీ కీలక పాత్ర పోషించారని, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నది కూడా మేఘా కంపెనీయే. ఈ ప్రాజెక్టు మేఘాకు దక్కడంలోనూ కేవీపీ కీలక పాత్ర పోషించారన్న వాదన వుంది. ఎందుకంటే, కేసీఆర్‌కు కేవీపీ మంచి సంబంధాలున్నాయి. ఇద్దరి సామాజికవర్గం కూడా ఒక్కటే. అటు వైఎస్ జగన్‌ కుటుంబానికీ కేవీపీ చాలా క్లోజ్. అందుకే కేసీఆర్‌, జగన్‌ల ఫ్రెండ్లీ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని, వీరిద్దర్నీ ఏకతాటిపైకి తెస్తున్నది కేవీపీయేనని, పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. అందుకే కాళేశ్వరం పనులు దక్కించుకున్న మేఘాకు, పోలవరం కాంట్రాక్టు కూడా దక్కిందన్నది కొందరు నేతలు చెబుతున్న మాట.

అయితే పోలవరం పనులు మేఘాకే దక్కడం అంత ఆషామాషీ కాదంటున్నారు కొందరు నేతలు. రివర్స్‌ టెండరింగ్‌తో లాభమన్న జగన్‌ వాదన నెగ్గాలంటే, చాలా నష్టాలకు నిర్మాణ సంస్థలు సిద్దపడాలి. అందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చన్న వాదనా సాగింది. అందుకే పోలవరం టెండర్లలో మేఘా ఒక్కటే నిలబడింది. 12.6 శాతం తక్కువకు ధరను కోట్‌ చేసింది. ఇంత తక్కువకు నవయుగతో పాటు ఏ కంపెనీ కూడా బిడ్‌ దాఖలు చేయలేకపోయింది. దీని వెనక కేవీపీ ఉన్నారన్నది చర్చ. ఎందుకంటే మేఘాతో నష్టానికైనా బిడ్‌ దాఖలు చేసి, జగన్‌ మాట నెగ్గించాలన్నది కేవీపీ పట్టుదలగా కనిపిస్తోంది. మేఘాకే పోలవరం దక్కడంతో, అటు జగన్‌ను, ఇటు మేఘానూ మెప్పించడంలో కేవీపీ సక్సెస్‌ అయ్యారన్న వాదన వినిపిస్తోంది.

మేఘా సంస్థ కూడా, ఇంత తక్కువకు బిడ్‌ దాఖలు చేయడంలో ప్రొఫెషనల్‌ రైవర్లీ వుందన్న వాదన వినిపిస్తోంది. భారీ నిర్మాణ రంగంలో రెండూ పోటాపోటీగా యుద్దం చేస్తున్నాయి. మేఘా కంపెనీ యాజమాన్యం రెడ్డి సామాజికవర్గానిది కాగా, గతంలో పోలవరం పనులు చేసిన నవయుగ చౌదరిలది. ఇలా సామాజికవర్గంతో పాటు ప్రొఫెషనల్‌ రైవర్లీతోనూ కత్తులు దూస్తున్నాయి మేఘా, నవయుగాలు. అందుకే నవయుగపై పైచేయి సాధించడానికి చాలా తక్కువకు పోలవరం పనులకు బిడ్‌ చేసింది మేఘా. ఇందులో కేవీపీదే కీలక పాత్ర అన్నది వినిపిస్తున్న వాదన.

మొత్తానికి కేసీఆర్‌, జగన్‌ల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్‌ చేయడంలో, కేవీపీ కీలక పాత్ర పోషిస్తున్నారని, పొలిటికల్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అందుకు జరుగుతున్న పరిణామాలే నిదర్శమంటున్నారు నేతలు. నాడు వైఎస్ హయాంలో అదృశ్య శక్తిగా వ్యవహరించిన కేవీపీ, నేడు తెలుగు రాష్ట్రాల పాలకవర్గాలను సైతం అదృశ్య శక్తిగా శాసిస్తున్నారని, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories