KTR: సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR  key comments on CM Revanth Reddy
x

KTR: సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Highlights

KTR: రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల

KTR: తెలంగాణలో విలీన రాజకీయ మంటలు చేలరేగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్‌, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్‌.. బీజేపీలో విలీనం అవుతుందని ఇటీవల సీఎం రేవంత్ చేసిన కామెంట్స్‌పై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే అని, త్వరలోనే ఆయన తన బృందంతో బీజేపీలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు కేటీఆర్. తాను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కేటీఆర్‌ ఆరోపణలు గుప్పించారు.

ఈ అంశంపై రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల అని, కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని దుయ్యబట్టారు కేటీఆర్. గ్రామస్థాయిలో రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరిస్తామని, ఆ వివరాలను జిల్లా కలెక్టర్లకు…ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామన్నారు. తెలంగాణ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులు తనకు అందాయని, ఈ నెల 24న కమిషన్ ముందు హాజరవుతానని కేటీఆర్ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు నిన్ననే బహిరంగ క్షమాపణ చెప్పానని... అయినప్పటికీ తనకు నోటీసులు ఎందుకు ఇచ్చారో తెలియదన్నారు. తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేతలు అన్న మాటలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళతానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories